NGKL: వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలో అందించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సలహా సంఘం సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ ఛైర్ పర్సన్ రత్నమాల, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తదితరులు హాజరయ్యారు.