SRD: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా వేలాది మంది కార్మికులతో నల్లజెండాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా ఐఎన్టీయూసీ నాయకుడు కొల్కూరి నరసింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఐఎన్టీయూసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. దీన్ని విజయవంతం చేయాలన్నారు.