కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి-రామారెడ్డి మధ్యలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాలభైరవ స్వామిని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి అభిషేకం చేసి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామి వారి చిత్ర పటంతో ఘనంగా సత్కరించారు.