NZB: మోస్రా తహసీల్దార్ పడాల మమత మంగళవారం బాధ్యతలు చేపట్టారు. వర్ని డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను ఇన్ ఛార్జ్ తహసీల్దార్‌గా మోస్రాకు బదిలీ చేశారు. ఇది వరకు ఇక్కడ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించిన రాజశేఖర్ జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు.