గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్లోని తాడికొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 63,75,935 విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య ఖర్చులు వంటి అత్యవసర పరిస్థితుల్లో సీఎం సహాయ నిధి ఎంతో ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు.