SRD: సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు గాను బాలికలకు HPV టీకా పంపిణీ కార్యక్రమాన్ని వైద్యాధికారులు ప్రారంభించారు. 14 నుండి 15 ఏళ్ల వయస్సు గల బాలికలకు ఈ వ్యాక్సిన్ వేశారు. భవిష్యత్తులో మహిళలకు క్యాన్సర్ ముప్పు తప్పించేందుకు ఈ టీకా ఎంతో కీలకమని వైద్యులు పేర్కొన్నారు.