»Indonesian Football Player Who Died On The Ground Due To Lightning Video Viral
Viral News: పిడుగుపాటుతో గ్రౌండ్ లోనే చనిపోయిన ఫుట్ బాల్ ప్లేయర్.. వీడియో వైరల్
ఫుట్బాల్ ఆట ఆడుతుండగా గ్రౌండ్లో పిడుగు పడి ప్లేయర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి ప్లేయర్లు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదు. అప్పటి వరకు ఎంతో హుషారుగా ఆడిన ఆటగాడు క్షణాల్లో విగతజీవిగా మారడం చూసి తోటి ప్లేయర్లు షాక్ అయ్యారు.
Indonesian football player who died on the ground due to lightning.. Video viral
Viral News: ఫుట్బాల్ ప్లేయర్ పిడుగుపాటుతో గ్రౌండ్లోనే మరణించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటన కెమెరాల్లో రికార్డయింది. ఆదివారం ఫుట్ బాల్ ఆడుతుండగా.. అప్పటి వరకు ఉత్సాహంగా జట్టును గెలిపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న తోటి ఆటగాడు క్షణాలలో నిర్జీవంగా మారడం మిగితా ప్లేయర్లను షాక్కు గురిచేసింది. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు సైతం నివ్వెర పోయారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం ఫిబ్రవరి 11 తేదీన ఎఫ్ సీ బాండుంగ్, ఎఫ్ బీఐ సుబాంగ్ జట్ల మధ్య వెస్ట్ జావాలోని సిలివాంగి స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా గోల్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో గ్రౌండ్లో ఓ ప్లేయర్ బాల్ కోసం చూస్తూ, దాని వైపు కదులుతున్న సమయంలో ప్లేయర్ పై పిడుగు పడింది. దాంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే మిగితా ప్లేయర్స్ దగ్గరకు వచ్చి సీపీఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.