ADB: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని బొందిడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు రమేష్ మంగళవారం పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజేందర్ ఉపాధ్యాయుడిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.