NLG: హాలియా పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను జిల్లా విద్యాశాఖాధికారి (DEO) భిక్షపతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో అందుతున్న భోజనం, ఇతర వసతులపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన డీఈవో, చేపట్టాల్సిన సివిల్ పనుల గురించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.