MDK: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో మండల స్థాయి బాలల సంరక్షణ కమిటీల బలోపేతంపై ప్రత్యేక వర్క్ షాప్ ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన MROలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, సీడీపీవోలు ఇతర అధికారులను ఉద్దేశించి హేమ భార్గవి మాట్లాడుతూ.. బాలల సంరక్షణను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు.