CTR: బుధవారం పౌర్ణమి సందర్భంగా దేవరకొండలో శ్రీ పార్వతీ సమేత జలకంఠేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో గిరి ప్రదక్షిణను ఈ పౌర్ణమి నుంచి ప్రారంభిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు.