ADB: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని SP అఖిల్ మహాజన్ అన్నారు. సుదీర్ఘకాలం సేవలందించి మంగళవారం పదవి విరమణ పొందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ జాదవ్ గుణవంత్ రావ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాదవ్ లింభాజీ నాయక్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరారు.