Telangana RTC: బస్ కండక్టర్ను చెప్పుతో కొట్టిన మహిళ
తెలంగాణలో బస్సు కండక్టర్లపై దాడులు పెరుగుతున్నాయి. మహిళకు ప్రభుత్వం అందించిన ఉచిత ప్రయాణాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది ప్రవర్తనతో కండక్టర్లు విసిగిపోతున్నారు.
Telangana RTC: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో తోడ్పడుతుంది. ఈ పథకం అమలులోకి వచ్చాకా చాలా మంది మహిళల ఆత్మస్థైర్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొంత మంది ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అలాగే బస్సు కండక్టర్లపై దాడులకు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితం చిల్లర కోసం ఓ మహిళా ప్యాసింజర్ కండక్టర్ను బూతులు తిడుతూ కాలితో తన్నింది. తాజాగా మరో మహిళ బస్సు కండక్టర్ను చెప్పుతో కొట్టింది. శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న అనే మహిళా బస్సు ఎక్కిది. హైదర్గూడ కల్లు కంపౌండ్ ప్రాంతంలో దిగాల్సిన మహిళ మరిచిపోయి అత్తాపూర్లో దిగింది.
వెనక్కి వెళ్లెందుకు మెహదిపట్నంలో ఉప్పల్ వెళ్తున్న 300 నంబర్ బస్సు ఎక్కింది. హైదర్గూడ బసుస్టాప్ ఇంకో 200 మీటర్ల దూరంలో ఉండగా బసును ఆపని గొడవ చేసింది. కండక్టర్ ముత్యాల నర్సింహ బసు స్టాప్ పక్కనే అని చెప్పినా వినకుండా.. మహిళలకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారంటూ.. ఆయనను చెప్పుతో కొట్టింది. నచ్చిన చోట దిగుతాము అని బూతులు తిట్టింది. తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకుని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు బసును తీసుకెళ్లారు. బస్సు పీఎస్ వద్ద ఆగగానే ప్రసన్న అక్కడి నుంచి పరారైంది. కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.