ఆసిఫాబాద్ పట్టణం జైన్ ఖరతరగచ్ఛ మహిళా మండలి పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం MLA కోవ లక్ష్మి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు మహిళా పరిషత్ సభ్యులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. మునిసిపల్ ఛైర్మన్ ఆకాష్, వైస్‌ఛైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.