NRPT: బ్యాంకులో రూ.రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న ప్రతి రైతు అప్పు మాఫీ చేయాలని కోరుతూ మంగళవారం నారాయణపేట తహశీల్దార్ అమరేంద్ర కృష్ణకు భారతీయ కిసాన్ సంఘ్ నేతలు వినతి పత్రం అందజేశారు.యూనియన్ పట్టణ ఉపాధ్యక్షుడు రాము మాట్లాడుతూ.. జిల్లాలో చాలా మంది రైతుల రుణాలు ఇంకా మాఫీ కాలేదని, వడ్డీల భారంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.