WGL: నర్సంపేట పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. RBSK బృందం విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి హీమోగ్లోబిన్ స్థాయిని పరిశీలించినట్లు తెలిపారు. ఇవాళ డాక్టర్ రవీందర్ సీపీఆర్ విధానంపై అవగాహన కల్పిస్తూ.. మానికిన్ డాల్ సహాయంతో ప్రదర్శన ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే విధానాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.