PPM: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వారికి అండగా నిలవడమే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై జరిగే నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖల సమన్వయంతో చట్టం అమలు సామర్థ్యాన్ని బలోపేతం చేయాలన్నారు.