TG: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. మూసీ పునరుజ్జీవంపై ప్రజల అభిప్రాయాలు స్వీకరించాలని నిర్ణయించారు. ఈరోజు నుంచి ఏప్రిల్ 15 వరకు సలహాలు స్వీకరించనున్నారు. musirrdc@gmail.comకు అభిప్రాయాలు పంపాలని సూచించారు.