SS: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత తెలిపారు. మంగళవారం పెనుకొండలో మూడు స్వచ్ఛ రథాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఊళ్లలోకి స్వచ్ఛ రథం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న పనికిరాని ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, గాజు సీసాలు వంటి వాటిని రథానికి ఇచ్చి సరుకులు తీసుకోవచ్చని తెలిపారు.