SRPT: హుజూర్నగర్ మండలం రామస్వామి గుట్ట వద్ద 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ కాలనీని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం పరిశీలించారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, అర్హులకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా త్వరలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు.