క్యాస్టింగ్ కౌచ్‌పై సీనియర్ నటి సత్యకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది కేవలం సినీ రంగంలోనే కాదు, ప్రతి చోటా ఉంది. మా వారు ధైర్యంగా బయటకు చెబుతున్నారు కాబట్టి అందరికీ తెలుస్తోంది. ఎవరైనా హద్దు దాటితే మహిళలు నో చెప్పే ధైర్యం కలిగి ఉండాలి. సినీ అవకాశాల కోసం కొంతమంది తప్పుదోవ పడుతున్నారు. మూవీ లేకపోతే జీవితమే లేదనుకునే వారే ఇలాంటి వలలో పడుతున్నారు’ అని చెప్పింది.