పిల్లల్లో అధిక జ్వరం, గొంతునొప్పి వంటివి అడినో వైరస్ లక్షణాలు. తుంపర్ల ద్వారా వ్యాపించే ఇది అరుదుగా నిమోనియాకు దారితీస్తుంది. సకాలంలో వైద్యుని సంప్రదించి, నీళ్ల వంటి పలచని ఆహారం(ద్రవ ఆహారం) ఇస్తూ, లక్షణాలకు తగ్గట్టు చికిత్స తీసుకుంటే పిల్లలు త్వరగా కోలుకుంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.