KRNL: మంత్రాలయంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ పత్రిక విలేకరి నాగరాజుకు రూ.54,100 నగదు ఇవాళ దొరికింది. వెంటనే బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఆయన ఆ నగదును పోలీసులకు అప్పగించారు. నాగరాజు చూపిన నిజాయితీని పోలీసులు, స్థానికులు అభినందించారు. నగదును స్వీకరించిన పోలీసులు యజమానిని గుర్తించి అందజేయడానికి చర్యలు చేపట్టారు.