SRD: సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఏప్రిల్ 2న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఎంపికైన వారికి ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.