ATP: గుత్తి మున్సిపాలిటీలో ఆస్తిపన్ను బకాయిల చెల్లింపుపై 50% వడ్డీ రాయితీని ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రజలు పెండింగ్లో ఉన్న ఆస్తి పన్నును ఒకే విడతలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ ఇస్తున్నామన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.