CTR: గ్యాస్ సిలిండర్ల సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. ఇప్పటివరకు 50 సమస్యలపై ఫిర్యాదులు రాగా.. ఏజెన్సీలతో చర్చించి 46 సమస్యలు పరిష్కరించామని చెప్పారు. గ్యాస్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ 08572-242734కు కాల్ చేయాలని సూచించారు.