PPM: పూతికవలస కన్నపుదొరవలస గ్రామాల మధ్య శుక్రవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఏనుగులను ఎట్టి పరిస్థితుల్లోనూ రెచ్చగొట్ట రాదని , కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు.