KMM: నేలకొండపల్లి మండలంలోని తిరుమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో ఎర్రయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ రికార్డులను, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారాన్ని ఆయన పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో రాజీ పడకుండా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.