BPT: నషా ముక్త్ భారత్ లక్ష్యంతో పోలీసులు సమర్థంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. శక్తి బృందాలు, ఈగల్ బృందాలు మరింత చురుకుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మొదటి విడతలో చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పుకొచ్చారు.