SS: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మహవీర్ జయంతి సందర్భంగా వర్ధమాన మహవీర్ చిత్రపటానికి రాష్ట్ర మంత్రి సవిత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస, శాంతి, కరుణ అనే మహవీరుడి బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.