VZM: కొత్తవలస మండల కేంద్రం కుమ్మరి వీధిలో సోమవారం దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు విజయనగరం క్లూస్ టీం బృందం మంగళవారం ఘటన స్థలాన్ని సందర్శించి, వేలిముద్రలు సేకరించారు. ముందుగా ఘటన జరిగిన ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. బృందం వెంట స్థానిక ఎస్సై ఎన్. జోగారావు, సిబ్బంది పాల్గొన్నారు.