AP: మంత్రి పయ్యావుల, MLA కాలవ శ్రీనివాసులు తుంగభద్ర డ్యాంని సందర్శించి, కొత్త గేట్లు అమర్చే పనులను తనిఖీ చేశారు. ఒకే సీజన్లో 33 గేట్లు మార్చిన ఘనత CBN ప్రభుత్వానిదేనని వారు పేర్కొన్నారు. రాబోయే 50 ఏళ్ల వరకు డ్యాం పటిష్టంగా ఉండేలా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పయ్యావుల అన్నారు.