ATP: కంబదూరు మండలం రాళ్లనంతపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను MLA అమిలినేని సురేంద్ర బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఆయన, మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. భోజనం సరిగా లేకపోవడంపై నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలని సూచించారు.