VKB: యువత స్వయం ఉపాధి మార్గంలో రాణించడం అభినందనీయమని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని కొడంగల్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ఫోటో స్టూడియోను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువ వ్యాపారవేత్తలు సొంతంగా ఎదగడం హర్షించదగ్గ విషయమన్నారు. నూతన స్టూడియో మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.