HYD: ట్యాంక్ బండ్ ఐమాక్స్ థియేటర్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్ వద్ద ఏప్రిల్ 11న ప్రారంభించుకునే మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహ నిర్మాణ పురోగతి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. 2 రోజుల ముందే విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభ ప్రాంగణంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.