బెంగళూరులో సహజీవనం చేస్తున్న టెకీ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతుడిని TG సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుంట బాబురెడ్డి(31)గా గుర్తించారు. అతడు ఆత్మహత్య చేసుకున్న అనంతరం అతడితో సహజీవనం చేస్తున్న యువతి(31) సైతం బలవన్మరణానికి పాల్పడింది. వారు ఉంటున్న భవనంలోని 17వ అంతస్తుపై నుంచి ఆమె దూకి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.