ATP: గుత్తి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను చెల్లింపులు 50% వడ్డీ రాయితీ చివరి రోజు కావడంతో ఆస్తి పన్ను చెల్లించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆస్తి పన్ను వడ్డీలో 50% రాయితీ ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించాలని కోరారు.