AP: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తన పిటిషన్లను ACB కోర్టు కొట్టేయడంపై YCP నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘ఇది న్యాయచరిత్రలో చీకటి రోజు. రూ.2500 కోట్ల IRR అవినీతిపై 2022లో ఫిర్యాదుచేశా. CBN, లోకేష్, నారాయణతోపాటు 20 మందిపై CID ఛార్జ్‌షీట్ వేసింది. ప్రభుత్వం మారగానే అంతా నిజాయితీపరులయ్యారు’ అని విమర్శించారు. అన్నీంటిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా అని స్పష్టంచేశారు.