NLG: చిట్యాల మండలం, బొంగోనిచెరువు గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని సర్పంచ్ కట్ట ఆశయ్య ఇవాళ ప్రారంభించారు. పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని రైతులను కోరారు. పశువైద్య సిబ్బంది శ్రీనివాసరావు, వెంకన్నలకు గ్రామంలోని అన్ని పశువులకు టీకాలు వేసేందుకు ప్రజలు సహకరించాలని అన్నారు. ఉప సర్పంచ్ సాయి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.