GNTR: తెనాలి పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పీపీపీ విధానంలో పలు పనులు చేపట్టనుంది. స్కైవాక్, ఆధునిక కాంప్లెక్స్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైంది. రైల్వే జంక్షన్‌గా ఉన్నప్పటికీ అభివృద్ధి నెమ్మదిగా సాగింది. పరిశ్రమలు లేకపోవడం లోపంగా మారింది. కాగా, ప్రస్తుతం కొత్తగా అపార్టుమెంట్లు, వాణిజ్య కేంద్రాలు పెరుగుతున్నాయి.