GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. 1వ తరగతి అడ్మిషన్లకు మార్చి 20 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 2తో ముగియనుంది. విద్యార్థులకు 2026 మార్చి 31 నాటికి 6 ఏళ్ళు పూర్తి కావాలి. అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. 2వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 2-4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.