AP: విశాఖ ‘మౌనిక హత్య’ నిందితుడు రవీంద్రకు కోర్టు APR 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అటు విచారణలో రవీంద్రలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని తెలుస్తోంది. కాగా తనకు వివాహమైన తర్వాత కూడా మౌనిక బ్లాక్మెయిల్ చేసిందని, వదిలించుకునేందుకే ఇలా చేసినట్లు రవీంద్ర చెప్పినట్లు సమాచారం. అయితే అతనే తమ బిడ్డను ట్రాప్ చేశాడని, కఠినంగా శిక్షించాలని మౌనిక పేరెంట్స్ కోరుతున్నారు.