కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.72.42 కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఆగస్టులో తాను కేంద్ర మంత్రికి రాసిన లేఖకు స్పందనగా ఈ నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో హార్బర్లో ఆధునిక సాంకేతికత, మెరుగైన వసతులు కల్పిస్తామని, దీనివల్ల వేలాది మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు.