హీరో నితిన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వి.ఐ. ఆనంద్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీ, నాగవంశీ నిర్మాణంలో ఒక చిత్రం లైనప్‌లో ఉండగా.. తాజాగా ‘ఆయ్’ దర్శకుడు అంజి కె. మణిపుత్రతో తన తదుపరి సినిమాను ప్రకటించాడు. రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినా, షూటింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.