VSK: విశాఖ ఉక్కు విశ్రాంత ఉద్యోగుల మెడికల్ ఇన్సూరెన్స్ సమస్యను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి విశ్రాంత ఉద్యోగులు సోమవారం తీసుకువెళ్లారు. ఆయన స్వయంగా ఉక్కు డైరెక్టర్‌తో ఫోన్లో సంప్రదించారు. ఉద్యోగుల సమస్యలపై మంగళవారం డైరెక్టర్‌ను కలిసి చర్చిద్దామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.