సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్ల గురించి ఎలాంటి న్యూస్ బయటికొచ్చిన క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ముఖ్యంగా ఫలానా హీరోయిన్, అతనితో డేటింగ్లో ఉంది, ప్రేమలో ఉంది, పెళ్లికి రెడీ అవుతుందని వినిపిస్తునే ఉంటుంది. తాజాగా అనుష్క గురించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది.
Anushka Shetty: అనుష్క(Anushka Shetty) అనగానే ముందుగా అందరికీ ప్రభాస్(Prabhas) గుర్తొస్తాడు. మొదటిసారి బిల్లా సినిమాలో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క.. ఆ తర్వాత బాహుబలి(Bahubali) సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.. అంటూ వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.. ఈ వార్తలన్నీ కేవలం పుకార్లుగానే ఉన్నాయి. ప్రభాస్, అనుష్క్ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఆ వార్తలను కొట్టిపారేస్తుంటారు. అయితే.. ప్రస్తుతం అనుష్క పూర్తిగా సినిమాలు తగ్గించింది. చివరగా నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
నెక్స్ట్ అనుష్క నుంచి సినిమా వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. ఇలాంటి సమయంలో అనుష్క పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ మధ్యన అనుష్క ఓ స్టార్ క్రికెటర్‌తో పెళ్లికి రెడీ అయిందనే టాక్ నడిచింది. కానీ తాజాగా మరోసారి స్వీటీ పెళ్లి విషయమై చర్చ మొదలైంది. ముందుగా చెప్పినట్టే ఆ స్టార్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ స్టార్ క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం ఎవరు బయటపెట్టలేదు. ఇప్పటికే వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారని, త్వరలోనే పెళ్లి జరగనుందని అంటున్నారు. త్వరలోనే అనుష్క తన పెళ్లి కబురు చెప్పనుందని చెబుతున్నారు. కానీ ఇందులో నిజం లేదని స్వీట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి.. ఏ విషయమైనా సరే అనుష్క చెప్పే వరకు నమ్మకుండా ఉండాల్సిందే.