KNR: కరీంనగర్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏఆర్ ఏసీపీగా ప్రతాప్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రామగుండం కమిషనరేట్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంను కలిసి మొక్కను అందజేశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. నూతన ఏసీపీకి తోటి అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.