TG: పార్లమెంట్ సీట్ల పెంపు అంశాన్ని మహిళా రిజర్వేషన్లతో ముడిపెడుతూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సీట్లు పెంచితే అన్ని స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ ప్రక్రియలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉండకూడదని, నియోజకవర్గాల మధ్య గ్యాప్ సమానంగా ఉండాలని కోరారు. మహిళా సాధికారతతో పాటు ప్రాంతీయ సమానత్వం కూడా ముఖ్యమని సీఎం అభిప్రాయపడ్డారు.