PLD: దాచేపల్లి(మం) కేసానుపల్లి గ్రామంలో మార్కెట్ యార్డ్ నిధులతో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రైతులకు పశువులకు సంబంధించిన ఉచిత మందుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ భారతి బద్రి, టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరి రామకోటయ్య, పశు వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.