W.G: 2019-24 కాలంలో వైసీపీ ప్రభుత్వంలో పాలకొల్లు వివక్షతకు గురైందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం పేదలు, మహిళల సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా పాలకొల్లులో పీఎంఏవై, ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళ గృహప్రవేశాల పండగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. నాడు చేయలేని పనులను నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నామని పేర్కొన్నారు.